DPRO MULUGU:రైతులు ఎవరు అధైర్య పడవద్దని, వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి పంటను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపేలా అవగాహనా కల్పించాలి :జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య .

వార్త ప్రచురణ
ములుగు జిల్లా,
డిసెంబర్ 02, ( గురువారం)
రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరు అధైర్య పడవద్దని, వచ్చే వేసంగి సీజన్లో ములుగు రైతులు వరి పంటను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపేలా చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారిలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
గురువారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ గోవిందరావు పెట్ మండలం చల్వాయి గ్రామంలో పర్యటించారు. ముందుగా కలెక్టర్ బుస్సా పూర్ గ్రామంలో శానిటేషన్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత మెరుగుపరుచుకోవాలని, హరితహారం ఇంప్లిమెంటేషన్ కావాలని అధికారులకు సూచనలు సలహాలు అందించారు.

అనంతరం చల్వాయి గ్రామం లో రైతు వేదిక వద్ద ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటుచేసిన ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన సదస్సు లో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి అని ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని వ్యవసాయ శాఖ అందించిన సలహాలు సూచనలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ పోస్టర్, మరియు బుక్ లెట్స్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు చల్వాయి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమశాతం వచ్చేవరకూ వడ్లు ఆరు దల చేసి కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొని రావాలని
తేమశాతం 17 ఉండి టోకెన్లు జారీ చేయకపోతే దాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోళ్లలో జాప్యం సహించబోమని అన్నారు. గన్ని బ్యాగ్ టార్పాలిన్ లు సిద్ధంగా ఉంచుకోవాలని ప్యాడీ క్లీనర్ లతో
నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు.
జిల్లాలో 1 లక్ష 10 వేల 682 ఎకరాలకు గాను 155 ధాన్యం కొనుగోళ్లు కు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో,ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ జితేందర్ రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ అక్బర్,  zptc .ఉమాదేవి
సర్పంచ్ ఈశం సమ్మయ్య ,రైతు సమన్యాయ సమితి
మండల్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఏఇఓ గోపాల్ రెడ్డి సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post