DPRO MULUGU :మేడారం జాతర ఏర్పాట్లు ముమ్మరం చేయాలి: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య *

* ప్రచురణార్థం *
ములుగు జిల్లా నవంబర్ 18 ( గురువారం ).

గురువారం రోజున మేడారం జాతర జరిగే ప్రదేశాలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యవేక్షించారు . మేడారం జాతర ఏర్పాట్లు ముమ్మరం చేయాలి అని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠిసంబంధిత సెక్టోరియల్ అధికారుల తో కలిసి పరిశీలించారు. అనంతరం సెక్టోరియల్ అధికారులతో కలెక్టర్ మేడారం జాతర ముందస్తు ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేసి వారి వారి శాఖల ద్వారా భక్తుల సౌకర్యార్థం జాతర జరుగు ప్రదేశాలలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతరను ఘనంగా నిర్వహించడానికి కావలసిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి సంబంధిత అధికారులతో జాతర జరిగే ప్రదేశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. గతంలో జరిగిన మేడారం జాతర ని దృష్టిలో పెట్టుకుని మీడియా కవరేజి సౌకర్యార్ధం మీడియా పాయింట్ ఎలెక్ట్రోనిక్ మీడియా వ్యూ పాయింట్ ను సుదరంగా తీర్చి దిద్దుటకు మరమ్మతులు ఇంజనీరింగ్ శాఖ కి ఆదేశాలు ఇచ్చారు. మేడారo లో భక్తులు తాకిడి మొదలైందని వారికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబదిత అధికారులను ఆదేశించారు.
టెంపరరీ టాయిలెట్స్ ను పర్మనెంట్ టాయిలెట్స్ గా చేఇంచుటకు ప్రతిపాదనలు సిద్దం చేయాలనీ కలెక్టర్ అన్నారు. గతంలో కంటే ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని బోర్ వెల్స్ గురించి ,మంచినీటి టాప్ లు ఏర్పాటు, టాయిలెట్ నిర్మాణం సులబ్ టాయిలెట్స్ మరమ్మతులు రోడ్ల మేడారం జరుగు ప్రదేశాల దగ్గర భక్తులకు జరుగు సకల సౌకర్యాలతో ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని గత మూడు సంవత్సరాల మేడారం జాతర వీడియోలను ఛాయాచిత్రాలను అధికారులందరూ క్షుణ్ణంగా పరిశీలించాలని శానిటేషన్ పరంగా జాతరలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెక్టార్ వారీగా సిబ్బందిని నియమించి పరిసరాల పరిశుభ్రత పై చర్యలు తీసుకుంటామన్నారు అన్ని శాఖలు నిబంధనల మేరకు టెండర్ల ద్వారా పనులు ప్రారంభించాలని అన్నారు. ఈరోజు నుంచి మూడు నెలల వరకు గ్రామ పంచాయతీ వారీగా మేడారం చుట్టుప్రక్కల గ్రామాలను పరిశుద్ద్యం చర్యలు చేపట్టుకకు స్తానికంగా ఉన్న వర్కర్స్ ను పెట్టి ఆయా గ్రామాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
మేడారంలో భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన 5 షేడ్స్ వద్ద ఆహార పదార్థాలు తాయారు చేసుకొనుటకు వంట షేడ్స్ నిర్మాణం చేపట్టుటకు ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశించారు. వాష్ ఏరియ, నిటి నిలువలు లేకుండా సొక్ ఫీట్స్ ఏర్పాటు చేయాలనీ సూచించారు. మేడారంలో పోలీస్ క్యాంపు నిర్వహించే ప్రదేశాల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ వో రమాదేవి, మిషన్ భగీరథ ఎస్సీ రామ్ చందర్,E.E మిషన్ భగీరథ మాణిక్యరావు, ఎటునాగారం ఐటిడిఏ ఇంజనీరింగ్ ఈ ఈ హేమలత సంబంధిత సెక్టోరియల్ అధికారులు మిషన్ భగీరథ, ఇంజనీరింగ్, ఏఈ , డి ఈ లు పాల్గొన్నారు.

Share This Post