DPRO MULUGU: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరుఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ అహ్మద్  నదీమ్

* ప్రచురణార్థం *

ములుగు జిల్లా నవంబర్ 17 (బుధవారం).

పోలింగ్ అధికారులు పొలిటికల్ పార్టీలు
ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తేనే 100% ఓటర్ జాబితా సవరణ పూర్తి అవుతుందని ఏ సమస్యలు లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవచ్చని మైనారిటీ వెల్ఫేర్ సెక్రెటరీ,అన్నారు.
బుధవారం రోజున ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ విధుల్లో భాగంగా అహ్మద్  నదీమ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఆయనకు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ,డిఆర్ వో రమాదేవి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తాసిల్దార్ లు, బి ఎల్ వో లు, పొలిటికల్ పార్టీ ల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం బాగంగా అబ్జర్వర్ గా రావడం జరిగిందని, ఎలక్షన్స్ కి ఓటర్ జాబితా చాలా ముఖ్యమని జిల్లాలో 9 మండలాలు ఉన్నాయని 2.15 లక్షల మంది ఓటర్స్ ఉన్నారని స్పెషల్స్ సమ్మరి రివిజన్ 2021 నడుస్తున్నాయి అన్నారు. సోషల్ కాంపెయిన్, స్పెషల్ డ్రైవ్ ద్వారా డాక్యుమెంట్స్ గురించి అవగాహన కల్పింపజేసి గరుడ యాప్ పై ప్రజలకు అవగాహన పెంచాలని, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి ప్రచారం చేయాలని అన్నారు. ప్రతి ఓటరు సెల్ఫ్ హెల్ప్ యాప్ లో ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఫామ్ 06, 07 ,8, 8A పై అవగాహన చేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూతుల కు బిఎల్ఓ లను నియమించడం జరుగుతుందని, ప్రతి కాలేజీలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల కు అర్హత ఉన్నవారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి ప్రచార పోస్టర్లు వేయించాలన్నారు.
తాసిల్దారు బి ఎల్ వో లు పొలిటికల్ పార్టీలు భాగస్వామ్యంతో అవగాహనతో సూచనలు సలహాలు పాటిస్తూ ఓటర్ జాబితా లో ఏమైనా సమస్యలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు అని అన్నారు
పొలిటికల్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ
ఓటర్ జాబితా సవరణ లో ముందుగా వోటర్ లిస్టు అందించినట్లయితే డబల్ ఓటర్స్ ఎవరైనా ఉన్నారా లేదా ,డెత్ కేసులకు సంబంధించి ఓటర్ లిస్టులో నుంచి పేరు తొలగించడం , ఓటర్ లిస్టు లో పేరు ఒకరిది, ఫోటో ఇంకొకరిది ఇలాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకుని పోలింగ్ అధికారులకు సహకరించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లు బి ఎల్ వో లు పొలిటికల్ పార్టీ ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Post