DPRO NIRMAL:ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా త్వరిత గతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.

 

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ రివ్యూ మీటింగ్
మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, SP ప్రవీణ్ కుమార్
ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ
నమోదు అయిన కేసులు పరిస్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు, బాధితులకు జరిగిన లబ్ది పై కమిటీ సభ్యులతో చర్చించారు.
అట్రాసిటీ కేసుల వాటి వివరాలు 2016-2021 వరకు 131 కేసు రిజిస్టర్ అయ్యాయని రిలీప్ పేమెంట్ 84 కేసులకు ఇవ్వడం జరిగిందని మిగిలిన వి త్వరితగతిన పేమెంట్ మంజూరు చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అట్రాసిటీ కేసు గ్రామంలో కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ పి. రాంబాబు, అడిషనల్ ఎస్పీ భైంసా, మరియు డీవీఎంసి మెంబర్స్ ముడుసు సత్యనారాయణ, బొట్టు లక్ష్మణ్, గంగారం, ఆజ్మీరా కాంత, కార్యాలయం సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల
అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post