DPRO NIRMAL:దివ్యాంగులకు అందుతున్న థెరపీ సేవలు ప్రశంసనీయం జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

.

పత్రికా ప్రకటన తేది:17.11.2021
నిర్మల్ జిల్లా బుధవారం

దివ్యాంగులకు అందుతున్న థెరపీ సేవలు ప్రశంసనీయం జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
బుధవారం బైంసా లోని విలీన విద్యా వనరుల కేంద్రం భవిత కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతూ దివ్యంగా పిల్లలకు భవిత కేంద్రాలలో అందుతున్న థెరపీ సేవలను ప్రశంసిస్తూ విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి నుండి సమాధానాలు చెప్పించారు. మాటలు రాని వారికి అందించిన సేవల వల్ల వారు పొందిన అభివృద్ధిని వారిచే మాట్లాడించి, పాడించి పర్యవేక్షించారు. అలాగే మనో వైకల్య పిల్లలతో ముచ్చటించి పలు ప్రశ్నలు అడిగారు. వారు చదువుతున్న విషయాలను అడిగారు, వారు సమాధానాలపై చాలా సంతృప్తి పొందారు. మొత్తంగా జిల్లాలో భవిత కేంద్రాలను దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న థెరపీ సేవలు సంతృప్తికరంగా, ప్రయోజన కరంగా ఉన్నాయని కొనియాడారు.
జిల్లాలో మొత్తం 4 గురు ఫిజియోథెరపిస్టులు, 2 స్పీచ్ థెరపిస్టులు సేవలందిస్తున్న న్నారన్నారు. అలాగే వీరి సేవలను 132 మండి ఫిజియోథెరపీ సేవలు, 86 మంది స్పీచ్ థెరపి సేవలను పొందుతున్నారని తెలిపారు. అలాగే భవిత కేంద్రాలకు హాజరయ్యే దివ్యాంగ విద్యార్థులకు సాయంగా 7 గురు ఆయాలు పని చేస్తున్నారని తెలిపారు.
భైంసా భవిత కేంద్రంలో మొత్తం 15 మంది థెరపీ సేవలందిస్తున్నారని, భైంసా కేంద్రంలోని వివిధ రకాల పిల్లలకు చదువుల విషయంలో వివిధ పద్ధతులను ఎలా అందిస్తున్నారని ఐ ఇ ఆర్పీలు నరేష్ సునీల్ లను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీ సుభాష్, జిల్లా విలీన విద్యా కోఆర్డినేటర్ ప్రవీణ్కుమార్, ఫిజియో థెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు మరియు ఆయాలు, విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post