DPRO NIRMAL:వ్యాక్సి నేషన్ ప్రతి మండలం లో వంద శాతం రెండు రోజుల్లో పూర్తి చేయాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ పలు మండలాల్లో విస్తృత పర్యటన.

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రాల వారీగా వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు. మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ 100% పూర్తిచేయాలని సూచించారు. గ్రామాలలో పిల్లలకు 100% వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే విధంగా వైద్య సిబ్బంది చూడాలని పేర్కొన్నారు.
అనంతరం ముజ్గి, దిలావర్ పూర్, నర్సపూర్ జి, ప్రారథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వాక్సినేషన్ ఎంత శాతం పూర్టెందో వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. బైంసా, కుభీర్ పట్టణంలో ఇంటింటి సర్వే ను పరిశీలించి , మిగిలిన వారికి తప్పనిసరిగా వాక్షిన్ వేసి రెండు రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని అన్నారు
ఈ కార్యక్రమం లో .
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవిన్యూ అదనపు కలెక్టర్ రాంబాబు , జిల్లా వైద్యాధికారులు, mro, ఎంపీడీఓ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post