DPRO NIRMAL: అంగన్వాడీ కేంద్రాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ.

పత్రికా ప్రకటన తేది: 25.08.2021

అంగన్వాడీ కేంద్రాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ.

0000

సెప్టెంబర్ 01 నుండి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పారిశుద్ధ్య పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాలలో పరిసరాల పరిశుభ్రత, డెంగ్యూ వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై అంగన్వాడీ టీచర్లతో బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో శానిటైజర్ చేయాలని, మంచి నీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, త్రాగునీరు తదితర వాటిని పునరుద్దరించాలన్నారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా మరుగుదొడ్లు, పరిసరాలలో నీరు నిల్వకుండా ప్రతి రోజు శుభ్రం చేయించాలని, నీటి సంపులను, ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. సెప్టెంబర్ 01 నుండి ప్రతి టీచర్ లైవ్ లొకేషన్ షేర్ చేయాలి అన్నారు. ప్రతి అంగన్వాడి కేంద్రం లో పిల్లలు, గర్భిణీల హాజరు పక్కగా ఉండాలని, వారి ఆరోగ్య స్థితిగతులపై వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 10 తర్వాత ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించి పౌష్టిక ఆహార లోపం ఉన్న పిల్లలకు, గర్భిణీలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………………జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post