DPRO NIRMAL: ఆయిల్ ఫామ్ మొక్కలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

పత్రికా ప్రకటన-4 తేది: 25082021

ఆయిల్ ఫామ్ మొక్కలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

౦౦౦౦౦

నిజామాబాద్ జిల్లా ఆర్మర్ మండలం చేపూర్ లో ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ బుధవారం సాయంత్రం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
మొత్తం 2 లక్షల 30 వేల మొక్కలు పెంచడం జరుగుతుందని, వచ్చే సంవత్సరం నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందని తదితర వివరాలను అధికారులు కలెక్టర్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*********************************************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీచేయనైనది.

Share This Post