DPRO
పత్రిక ప్రకటన
తేది :25.09.2021
75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాధికా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా జిల్లా లో ఎగుమతిదారుల అవగాహన సదస్సును జిల్లా పరిశ్రమల కేంద్రం, జనరల్ మేనేజర్ జే. వి. నరసింహ రెడ్డి అధ్యక్షతన శవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం లో నిర్వహించిన సందర్బంగా జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతూ జిల్లా లో ఎగుమతిదారులు, వివిధ వాణిజ్య బ్యాంకులు, పరిశ్రమల శాఖ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సహకారాన్ని ఉపయోగించుకొని జిల్లా ను ఎగుమతులకు ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను కోరారు.
అంతకుముందు జనరల్ మేనేజర్ మాట్లాడుతూ జిల్లా ను ఎగుమతు లకు ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఉన్న సదుపాయల వనరుల గురించి వివరించారు.
ఈ కార్యక్రమం లో పారిశ్రామిక వేత్తలు పీ. కృష్ణ సంతోష్, రవిప్రకాష్, నాజాంసింగ్ మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
***************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.