DPRO NIRMAL: ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష. జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్.

ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష.
జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్.

ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ శనివారం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2022 ఓటరు జాబితా తయారు, వచ్చే జనవరి 1 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేయుట ఎన్నికల గుర్తింపు కార్డుల జారీ ఇతర మార్పులు చేర్పులు చేసేందుకు నిర్ణీత ప్రొఫార్మా ను అందచేయుట, ఓటరుగా నమోదు అయ్యేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 2022 ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయాలని సూచించారు. ఈవీఎంలను రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో తనిఖీలు నిర్వహించి సిద్ధంగా ఉంచాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిధులకు సంబంధించిన అంశంపై సరిపడా నిధులు ఉన్నాయని, ఓటరు నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అనిరుద్, షబ్బీర్, సిబ్బంది రాజశ్రీ, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

*******************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post