DPRO NIRMAL: ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన అన్ని జిల్లాల్లో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

పత్రిక ప్రకటన
తేది 27. 10. 2021
నిర్మల్ జిల్లా బుధవారం

ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన అన్ని జిల్లాల్లో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో స్పెషల్ సమ్మరి రివిసన్ -2022 ముసాయిదా ఓటరు జాబితా పై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ సెప్టెంబర్, 30వ తేదీ వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్, 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫోటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి సరిచేసే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి, 5వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సిందిగా సూచించారు.
ఓటర్లు ఇండ్లు మారడం వల్ల పోలింగ్ స్టేషన్లు అదనంగా అవసరం ఉన్నట్లయితే, లేదా పోలింగ్ కేంద్రం వేరే చోటికి మార్చవలసినవి ఉన్న ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి ఆమోదంతో తగు మార్పులకు సిఫారసు చేయవచ్చన్నారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోవడానికి గరుడ యాప్ ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ ఎలా ఉపయోగించాలో బూత్ లెవెల్ అధికారులకు (బి.యల్.ఓ) పూర్తి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.
ఇ.వి.యం.ల భద్రత పై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అన్నీ జిల్లాల్లో స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జనవరి, 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయిన యువతి యువకులు ఆన్లైన్ ద్వారా గాని, ఫారం 6 ద్వారా కానీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం గావించాల్సిందిగా సూచించారు.

జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు, పేర్లు మార్పుకు వచ్చిన దరఖాస్తులు అన్ని పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ లోకేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post