DPRO NIRMAL: ఓటరు నమోదు ప్రక్రియ పై సమీక్షించేందుకు నిర్మల్ కు వచ్చిన ఎలాక్ట్రో్రోల్ అబ్సర్వర్ సురేందర్ రెడ్డి ని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పూలబొకె అందించి స్వాగతం పలికిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

 

పత్రికా ప్రకటన
తేదీ 20 -11- 2021
నిర్మల్ జిల్లా శనివారం

ఓటరు నమోదు ప్రక్రియ పై సమీక్షించేందుకు నిర్మల్ కు వచ్చిన ఎలాక్ట్రో్రోల్ అబ్సర్వర్ సురేందర్ రెడ్డి ని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పూలబొకె అందించి స్వాగతం పలికిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
18 సంవత్సరాలు నిండిన ఏ ఒక్కరి పేరు మిస్ కాకుండా పక్కాగా నమోదు చేయాలి ఎలక్ట్రోరల్ రోల్ అబ్సర్వర్, (సెక్రెటరీ MA &UD dept )
సి. సుదర్శన్ రెడ్డి.

18 సంవత్సరాలు నిండిన వారందరూ కొత్తగా ఓటర్ గా నమోదు అయ్యేందుకు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే ఓటర్లు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోనేలా అధికారులు పక్కా ప్రణాళికతో ఓటరు జాబితా ను సిద్ధం చేయాలని ఆదేశించారు.
శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఓటరు నమోదు ప్రక్రియ పై తహసీల్దార్ లు,, బూత్ లెవెల్ అధికారులు, అంగన్వాడీ టీచర్లతో అదనపు కలెక్టర్ డా,,పి. రాంబాబు తో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా అబ్సర్వర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచించిన ప్రవర్తన నియమావళి ప్రకారం నిర్వహించాలని అన్నారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణ తదితర అంశాలపై తహసీల్దార్ లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. 01-01-2022 వరకు 18సంవత్సరాలు నిండిన వారందరిని ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేయాలని బి ఎల్ వో లకు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని, శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డా.. పి. రాంబాబు రెవిన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్ అర్బన్ తహసిల్దార్ లు ,బి ఎల్ వో లు, అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post