DPRO NIRMAL: కుంటాల మండలం దొనెల్లి సూర్యపూర్ ఎం పి యు పి ఎస్ ప్రాథమికఉన్నత పాఠశాలను జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ గురువారం ఆకస్మికంగా సందర్శించారు.

 

 

పత్రిక ప్రకటన
తేది :25.11.2021
నిర్మల్ జిల్లా గురువారం

కుంటాల మండలం దొనెల్లి సూర్యపూర్ ఎం పి యు పి ఎస్ ప్రాథమికఉన్నత పాఠశాలను జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి అభినందించారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న వంటశాల నిర్మాణ పనులను కాంట్రాక్టర్ పూర్తి చేయకపోవడంతో గ్రామ పంచాయతీ నిధుల కింద నిర్మాణ పనులను చేపట్టాలని, వంట గ్యాస్ సిలిండర్ అందించాలని, మరుగుదొడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని సర్పంచ్ ను ఆదేశించారు.
అంగన్వాడీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నందున అసిస్టెంట్ ఇంజనీర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్కడే, విద్యా శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post