DPRO NIRMAL: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు నిర్మల్ జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.

పత్రిక ప్రకటన
తేది 17.09.21

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా కు నిర్మల్ జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. శుక్రవారం హోం మంత్రి హెలికాప్టర్ ద్వారా ఇక్కడకు చేరుకున్నారు. స్థానికంగా ఎల్లపెల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ కేంద్ర హోమ్ మంత్రి కి పుష్ప గుచ్చ ము అందచేశారు. కలెక్టర్ వెంట జిల్లా SP సి హెచ్ ప్రవీణ్ కుమార్,అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే,, రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక అటవీశాఖ విశ్రాంతి భవనం లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి కి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు పుష్ప గుచ్చా లు అందజేసీ స్వాగతం పలికారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమం లో దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు, ఐజీ నాగిరెడ్డి అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

*******************************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post