DPRO NIRMAL: కోవిడ్ నుండి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను మరింత వేగం పెంచాలి.. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది 12.10.2021

కోవిడ్ నుండి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను మరింత వేగం పెంచాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా లో జరుగుతున్న వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ పై జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లా ప్రజలను kovid-19 నుండి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి వరకు 190 గ్రామాల్లో వంద శాతం పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు.
భవిష్యత్తులో ఈ మహమ్మారి నుండి ప్రజల ను రక్షించుకునేందుకు, ప్రస్తుతం పండుగల నేపథ్యంలో ప్రజల సమూహాలు ఎక్కువగా ఉండడం వలన కోవిడ్ విస్తరించకుండా ఉండేందుకు టీకా ఒక్కటే మార్గమనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా టాంటామ్ వేయించి మిగిలివున్న వార్డులలో, గ్రామాల్లో టీకా తీసుకొని వారందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు టీకా వేసుకొనేలా చర్యలు చేపట్టి, వంద శాతం పూర్తి చేసి డిక్లరేషన్ ఇవ్వాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా ముధోల్, కుబీర్, కుంటాల, బాసర లలో ఎక్కువ ద్రుష్టి సారించాలని , ప్రతి ఇంటింటికి స్టిక్కర్లు అంటించాలని అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖధికారులు, ప్రత్యేక అధికారులు శిబిరాలను తనిఖీ చేస్తూ ప్రజలలో అవగాహన కల్పించి ఈ నెల 14 వ తేదీనాటికి ( గురువారం ) వంద శాతం పూర్తి చేసి జిల్లా ను స్పెషల్ డ్రైవ్ లో ముందుంచాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ పి. రాంబాబు, జిల్లా వైద్యాధికారి దన్ రాజ్, జిల్లా అధికారులు ఆర్డీఓలు, ఎంపీడీఓ, ఎంపీవో, తదితరులు పాల్గొన్నారు.

******************జారీ చేయివారు: జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్.

Share This Post