పత్రికా ప్రకటన తేది: 02.11.2021
కోవిడ్ మూడవ ప్రమాదం పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరికి టీకా వేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి అన్నారు. మంగళవారం దస్తురాబాదు, కడెం ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మొదటి డోసు ఎంతమందికి, రెండవ డోసు ఎంతమందికి వేసారు అని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా ప్రకారం దస్తురాబాద్ మండలం లో 95.69% వ్యాక్సినేషన్ జరిగిందని, మిగిలిన వారికి కూడా వేసి వందశాతం లక్ష్యం సాధించాలన్నారు. దస్తురాబాద్ మండలం లో కోలం తెగ ప్రజలు వెనుకాడుతున్నారని, వారికి కౌన్సెలింగ్ చేసి వ్యాక్సిన్ వేయాలన్నారు. కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 86% వ్యాక్సినేషన్ అయినదని వైద్య అధికారి తెలపగా పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్న వారికి కౌన్సెలింగ్ చేసి టీకా వేయాలని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా ప్రకారం ప్రతి ఒక్కరికి కచ్చితంగా వ్యాక్సిన్ వేయాలని అన్నారు.
ఈకార్యక్రమంలో డీఎం అండ్ హెచ్వో శ్రీ ధనరాజ్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్వో శ్రీకాంత్, తహసీల్దార్లు గజానన్, ఖలీమ్, వైద్యాధికారులు కిరణ్మయి, అరుణ్, ఎంపీడీవో క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
****************జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.