DPRO NIRMAL: కోవిడ్ వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రాలకు కేటాయించిన టార్గెట్ ను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ముషర్రఫ్ ఫారుఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన
తేది :20.09.2021

కోవిడ్ వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం లో భాగంగా కేంద్రాలకు కేటాయించిన టార్గెట్ ను నూటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం లక్ష్మణచందా మండలం వడ్యాల్, సోన్ మండలం న్యూ వెల్మల్, సారంగాపూర్ మండలం జామ్ గ్రామ పంచాయతీ కార్యాలయాలలో వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన సమయానికి, ఒక్కొక్క కేంద్రం లో ఒక రోజుకు వాక్సిన్ రెండు వందల మందికి ఇవ్వాలనే లక్ష్యం కాగా మధ్యాహ్నం 12.45 గంటలకు వరకు వడ్యా లలో 29, న్యూ వెల్మలలో 56, సొన్ లో 60, పాత జామ్ లో 48 మందికి వాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 6.00 గంటల సమయానికల్లా లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా వైద్యాధికారి దన్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.

**********************జిల్లా పౌర సంబంధాల అధికారు నిర్మల్ చే జారీచేయనైనది.

Share This Post