DPRO NIRMAL: క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలి….. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

 

 

 

 

పత్రికా ప్రకటన తేది:21.12.2021

క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలి
క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ రాష్ర్టానికి, నిర్మల్ జిల్లాకు పేరుతేవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్లోని యన్ టి ఆర్ స్టేడియంలో స్టాఫ్ బాల్ క్రీడాకారుల శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ నెల 11 నుండి 21 వరకు స్టాప్ బాల్ శిక్షణ రాష్ట్రస్థాయి మహిళా జట్టు ఎంపిక కోసం రాష్ట్ర క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనైనదని రాష్ట్రము లోని అన్ని జిల్లాల నుండి 23 మంది క్రీడాకారులు పాల్గొనగా ఇందులో 16 మందిని ఎంపిక చేసి జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును ఖరారు చేయనైనది. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులతో మంత్రి కరచాలనం చేసి వారితో సాఫ్ట్ బాల్ ఆడారు. స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్బంగా మంత్రి అన్నారు. ఎంపికైన రాష్ట్ర జట్టు ఈనెల 24 నుండి 28 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగే సాఫ్ట్బాల్ జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొంటుంది.
రాష్ట్ర సెక్రటరీ శోభన్ బాబు, నిర్మల్ జిల్లా సెక్రటరీ అన్నపూర్ణ క్రీడాకారుల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షకులుగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ మండల అధ్యక్షులు శ్రీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్,
వ్యాయామ ఉపాధ్యాయుడు బుక్యా రమేష్ కౌన్సిలర్ మాజిద్, లక్ష్మణ్చందా జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post