DPRO NIRMAL: ఖానాపూర్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి .

 

 

 

పత్రికా ప్రకటన తేది: 06.01.2022

ఖానాపూర్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని పలు అభివృద్ధి పనులను గురువారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి పరిశీలించారు . రూ॥లు 25 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. కంపోస్ట్ పిట్స్ ల నిర్మాణం ఇంకా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరుచేసే షెడ్లను వెంటనే నిర్మించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ సంతోష్ ను ఆదేశించారు. అనంతరం
గోదావరి ఒడ్డున పుష్కరఘాట్ వద్ద 60 లక్షల వ్యయంతో నిర్మించిన శ్మశానవాటికను పరిశీలించి నది ప్రవాహము ఉన్న వైపు ప్రమాదాలు సంభవించకుండా స్టీలు రైలింగ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.అక్కడ నుండి ఖానాపూర్ పట్టణం నడి బొడ్డున గల ఖబరిస్థాన్ ప్రాంతాన్ని సందర్శించి ఖాబరిస్తాన్ రోడ్డును ఆక్రమించడాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంటనే పోలీసు అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు సూచించారు.ఖానాపూర్ పట్టణంలో ఉద్యానవనం నకు రూ॥లు 90 లక్షలు మంజూరు కాగా ఇప్పటికే 60 లక్షల వ్యయంతో సుందరంగా నిర్మించిన ఉద్యానవనంలో మిగతా 30 లక్షల ఖర్చుతో లాన్ ఏర్పాటుచేసి స్ప్రింక్లర్లు అమర్చాలని ఆదేశించారు.
కోర్టు భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన
నిర్మల్ పట్టణం సోఫినగర్లో 240,241 సర్వేనంబర్ లోగల డిస్ట్రిక్ మార్కెటింగ్ సొసైటీ స్థలాన్ని జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తో కలిసి గురువారం పరిశీలించారు. నిర్మల్ జిల్లా కొత్తగా ఏర్పాటు అయినందున నూతన కోర్టు భవనాల సముదాయం కోసం 5 ఎకరాల స్థలం అవసరమవుతున్నందున కలెక్టర్ ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలంలోనే 5 ఎకరాల భూమిని కోర్టు నిర్మాణానికి కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడే, మున్సిపల్ కమిషనర్ సంతోష్, ఏఇ తిరుపతి, ఎమ్మార్వో లక్ష్మి, ఎంపీడీవో వనజ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post