DPRO NIRMAL: గాజులపేట లో ఫీవర్ సర్వేను పర్యవేక్షించిన కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి.

 

 

పత్రికా ప్రకటన తేది:21.01.2022

గాజులపేట లో ఫీవర్ సర్వేను పర్యవేక్షించిన కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి

శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి రెండవ రోజు స్థానిక నిర్మల్ మున్సిపాలిటీలోని గాజుల్పేట్ వార్డులో ఇంటింటికి తిరిగి స్వయంగా పర్యవేక్షించారు. Prajalanu వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని, 2 డోసు ల తర్వాత6 నెలలు ఐతే బూస్టరు దోస్ కూడా వేసుకోవాలని తెలిపారు. ఇంట్లో అందరు ఆరోగ్యం గా ఉన్నారా అనారోగ్యం తో ఎవరైనా unte సర్వే బృందం నకు తెలిపినట్లయితే మందులు ఇస్తారని తెలిపారు. ప్రజలను అడిగి జ్వరంతో ఉన్న వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేశారు. ఎవరైనా జ్వరాలు లేదా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ వేసుకోనేల మోటివేట్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఒక్క ఇల్లు కూడా వదలకుండా సర్వే లో ఆ ప్రాంతం లోని అన్ని ఇండ్లు పూర్తి చేయాలనన్నారు 15నుండి 17 సంవత్సరాల వయసు గల వారు ఉంటే వారికీ కూడా వాక్సిన్ తప్పక వేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్వో ధన్ రాజ్, మున్సిపల్ కమీషనర్ సత్య నారాయణ, మెప్మా పీడీ subhashతదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post