DPRO NIRMAL: చాకలి ఐలమ్మ భావి తరాలకు స్ఫూర్తి ప్రదాత …నివాళులు అర్పించిన మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి.

చాకలి ఐలమ్మ భావి తరాలకు స్ఫూర్తి ప్రదాత …నివాళులు అర్పించిన మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి..వెనుక బడిన కులానికి చెందిన చాకలి ఐలమ్మ పోరాట పటిమ, త్యాగం భావి తరాలకు స్ఫూర్తి దాయకమని రాష్ట్ర దేవాదాయ అటవీ, న్యాయ మరియు పర్యావరణ శాఖా మంత్రి శ్రీ ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఐలమ్మ 126 వ జయంతి వేడుకలు సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి మరియు వర్ధంతి వేడుకలను ప్రభుత్వం పరంగా నిర్వహిస్తున్నదన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం లో ని కలెక్టర్ కార్యాలయం లో ఐలమ్మ చిత్ర పటానికి మరియు మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విగ్రహానికి కు మంత్రి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒకరు ఐలమ్మ ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలన్నారు.జిల్లాలో ముందుగా సోన్ గ్రామంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేశారాని ఆ తర్వాత అంతటా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రజకులను ఎస్ సీ జాబితా లో చేర్చాలని కోరుతున్నందున అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపవలసి ఉంటుందన్నారు. ధర్మసాగర్ చెరువు మినీ ట్యాంక్ బండ్ లా అభివృద్ధి ఐయ్యిందని మిగత చెరువు లను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పెరుగు తున్న జనాభ ననుసరించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్, అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్ఖడే, శ్రీ రాంబాబు, ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

*********************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post