DPRO NIRMAL: చామన్ పెల్లి రామాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

పత్రికా ప్రకటన తేది: 12.10.2021
చామన్ పెల్లి రామాలయ నిర్మాణానికి మంత్రి భూమిపూజ
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలంలోని చామన్ పెల్లి గ్రామంలో రూ 50 లక్షలతో నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖా మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు.
రూ 10 కోట్లతో 78 ఆలయాలు మంజూరు కాగా 48 పూర్తి అయినాయని మంత్రి తెలిపారు. గ్రామస్థులు దీక్షపూని 6 నెలల్లో వచ్చే శ్రీరామ నవమి వరకు మందిరం నిర్మాణానికి సహకరించాలని మంత్రి కోరారు. గ్రామస్థుల కోరిక మేరకు 50 లక్షల నిర్మాణవ్యయంలో 20%వాటా ధనం 10 లక్షలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ మొత్తం నిధులను ప్రభుత్వమే మంజూరు చేయడం జరిగిందన్నారు. మంజూరు చేసిన నిధులు త్వరగా విడుదల చేయిస్తానని అన్నారు. బాబాపూర్ చెక్ డ్యామ్ 3 నెలల్లో కట్టడం జరిగిందని, చెక్ డ్యామ్ ల నిర్మాణం వల్ల భూగర్భజలాలు పెరిగాయని అన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టరు, డంప్ యార్డులు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి బాగా జరిగిందని భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం చెట్ల పెంపకం లో అగ్రస్థానంలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా ఉండేదని ప్రస్తుతం 140 కోట్ల జనాభా ఉందని, ఆ నిష్పత్తిలో వనరులు సమకూర్చుకోవాల్సి ఉంది అని అన్నారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. గ్రామంలో హనుమాన్ మందిరానికి రూ 10 లక్షలు మంజూరు చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచి గంగాధర్, ZPTC రాజేశ్వర్, RDO రాథోడ్ రమేష్, MRO కవితారెడ్డి, దేవాదాయ శాఖ ఏఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

*****************************జారీ చేయువారు:జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్.

Share This Post