DPRO NIRMAL: జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన గిరిజన విద్యార్థి ఆర్. సాయినాథ్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ.

జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన గిరిజన విద్యార్థి ఆర్. సాయినాథ్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ.

నిర్మల్ జిల్లా పెంబి మండలం కర్ణం లొద్ది పంచాయతీకి చెందిన ఆర్. సాయినాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మతురా జిల్లాలో 06 .08 .2021 నుండి 08 .08 .2021 వరకు జరిగిన అండర్ -19 కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టౌర్నమెంట్ లో మన రాష్ట్ర౦ జట్టు తరుపున క్యాప్టన్ వహిస్తూ ఆడి బంగారు పథకం సాధిచారు.
ఈ సందర్బంగా జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్.సాయినాథ్ ను జిల్లా కలెక్టర్ శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ డివో ముత్తన్న, పెంబి జడ్.పి.టి.సి భుక్యా జానుబాయి, పిడి భుక్యా రమేష్, పిఇటిలు సంజీవ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post