DPRO NIRMAL: జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి.

పత్రికా ప్రకటన* తేదీ 30.09.2021.
*జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి.*
గురువారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీ ముషర్రాఫ్ అలీ ఫరూకీ మాట్లాడుతూ రైతులు ఈ సీజన్‌లో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని 11.20 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి పండుతుందని అంచనా వేసామని తెలిపారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ. 6025/- మద్దతుధరను ప్రకటించిందన్నారు. నవంబరు మొదటి వారంలో పత్తికొనుగోళ్ళు జరుగుతున్నందున అధికారులు ప్రణాళికబద్ధంగా కొనుగోలు ప్రక్రియ జరిగేలా చూడాలని, అన్ని మార్కెట్ యార్డుల కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శులను ఆదేశించారు. అన్నీ జిన్నింగ్ మిల్లుల లోని కాంటాలను, వే బ్రిడ్జిలను తనిఖీ చేసి స్టాంపింగ్ చెయ్యాలని లీగల్ మెట్రాలజీ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో రైతులకు కనీస మద్దతు ధర రావటానికి సహకరించాలని అడిషనల్ కలెక్టరు శ్రీ రాంబాబు అన్నారు. రైతులు ఎదురు చూడకుండా ఉండేందుకు సెలవు దినాలను తెలపాలని ముందుగా కూపన్లు జారీ చేయాలని అక్టోబర్ 15లోగా ఒక క్రమపద్ధతిలోఅన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ రామ్ రెడ్డి , ఆర్టీవో అజయ్ రెడ్డి, ఆర్డీవో భైంసా శ్రీ లోకేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, మార్కెట్ కార్యదర్శులు, సిసిఐ cpo, జిల్లా ఫైర్ అధికారి మరియు నిర్మల్, భైంసా జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు

Share This Post