DPRO NIRMAL: జిల్లా లోని శాంతినగర్, గాజులపేట లలో ఫ్లడ్ ఫీవర్ సర్వే ను పరిశీలించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

పత్రికా ప్రకటన
తేది: 27.08.2021
నిర్మల్ జిల్లా

జిల్లా లోని శాంతినగర్, గాజులపేట లలో ఫ్లడ్ ఫీవర్ సర్వే ను పరిశీలించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. …..

శుక్రవారం నిర్మల్ పట్టణం లోని శాంతినగర్, గాజుల పేట్ కాలనీలలో ప్లడ్ ఫీవర్ సర్వే లో భాగంగా పర్యటించి
మాట్లాడుతూ డెంగ్యూ నియంత్రణ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని వెంటనే తొలిగించాలని,పనికిరాని పాత్రలు, టైర్లు, పగిలిపోయిన బకెట్లు, ఇంటి పరిసరాలలో లేకుండా చూడాలని, ఇంటి పైకప్పు పైన, టెర్రన్లు, సన్ షెడ్ లపైన నీరు నిలువకుండా శుభ్రం చేయాలన్నారు.

ఈ పర్యటన లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ధన్ రాజ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

********************************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీచేయనైనది.

Share This Post