DPRO NIRMAL: ట్రిపుల్ ఐటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి.

ప్రచురణార్థం
21.09.2021

మంగళవారం ట్రిపుల్ ఐటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి.
    నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ అభివృద్ధి పనులు, యంత్రాల మరమ్మత్తులు, సుందరీకరణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా క్యాంపస్ లోని లాబొరేటరీలను, విద్యార్థి తరగతి గదులను, వసతిగృహాలు, క్రీడా ప్రాంగణాలు, ఆడిటోరియం, వ్యాయామశాలలు సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. లాబరేటరీలో యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మరియు ఎక్స్ రే డై ఫ్రాక్షన్ మిషన్ సాంకేతిక మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన తదితర అంశాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్ సుందరీకరణపై శ్రద్ధ వహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  అనంతరం కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి, అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్ఖడే, పి. రాంబాబు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  ట్రిపుల్ ఐటీ ఏవో ప్రొఫెసర్ రాజేశ్వర్రావు, సివిల్ డీఈ ఎం. రాజాకిషన్ రెడ్డి,   అసిస్టెంట్ రిజిస్టర్ జి. రంజిత్ కుమార్ కోఆర్డినేటర్ రాకేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు          

****************************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనునైనది.

Share This Post