DPRO NIRMAL: డెంగ్యూ, మలేరియా వంటి సిజినల్ వ్యాధుల నియంత్రణ కు మున్సిపల్ కౌన్సిలర్ లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అరికట్టాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.

పత్రిక ప్రకటన 4
తేది 04.09.2021
నిర్మల్ జిల్లా.

డెంగ్యూ, మలేరియా వంటి సిజినల్ వ్యాధుల నియంత్రణ కు మున్సిపల్ కౌన్సిలర్ లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అరికట్టాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు. శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించిన సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తో పాటు నీరు నిల్వ లేకుండా చూసుకొనేవిధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు.
ఇంటి పరిసరాలలో పాత కులర్స్, టైర్లు, పాత్రల్లో నిల్వ ఉన్న మంచి నీటిలోనే డెంగ్యూ దోమలు తయారవుతాయన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. అదే విదంగా మన ఇంటి చుట్టూ ప్రక్కల మురికి నీటి, కాలువలు, గుంటలు వంటివి అపరి శుభ్రంగా ఉన్న వాటిని పురపాలక సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రతీ వార్డులో బ్లీ చింగ్ పౌడర్, దోమల మందు పిచికారీ డెంగ్యూ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి శుక్రవారం డ్రై డే ను నిర్వహించాలని, వార్డ్ మెంబర్లతో సమావేశం నిర్వహించుకోవాలని, మహిళా సంఘాలతో అవగాహన కల్పించాలని అన్నారు. కొత్త చట్టం ప్రకారం కౌన్సిలర్ లు సానిటేషన్ లో చొరవ తీసుకొని ప్రతి రోజు ఫీల్డ్ కి వెళ్లాలని అన్నారు.
మన జిల్లా లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన నియంత్రణ కు అందరు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు,తదితరులు పాల్గొన్నారు.

******************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post