DPRO NIRMAL: డెంగ్యూ వ్యాధి నియంత్రణకు ఉచిత ఓడోమస్ మందుల పంపిణీ. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ.

పత్రికా ప్రకటన-2 తేది: 01.09.2021

డెంగ్యూ వ్యాధి నియంత్రణకు ఉచిత ఓడోమస్ మందుల పంపిణీ.

జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ.

00000

డెంగ్యూ, మలేరియా వంటి సిజినల్ వ్యాధుల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ అన్నారు.
బుధవారం పట్టణంలోని వైఎస్ఆర్ కాలోనిలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దోమల వల్ల కలిగే వ్యాధుల నియంత్రణకు (గుడ్ నైట్-కంపెనీ) ఉచిత ఓడోమస్ మందులను ఆయన ప్రజలకు పంపిణీ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు.
ఇంటి పరిసరాలలో పాత కులర్స్, టైర్లు, పాత్రల్లో నిల్వ ఉన్న మంచి నీటిలోనే డెంగ్యూ దోమలు తయారవుతాయన్నారు. పరిసరాలను మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. అదే విదంగా మన ఇంటి చుట్టూ ప్రక్కల మురికి నీటి, కాలువలు, గుంటలు వంటివి అపరి శుభ్రంగా ఉన్న వాటిని పురపాలక సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రతీ వార్డులో బిచింగ్ పౌడర్, దోమల మందు పిచికారీ డెంగ్యూ నివారణకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వైస్ చైర్మన్ యస్.కె సాజిద్, ఏఈ వినయ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

**************************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయడమైనది.

Share This Post