DPRO NIRMAL: తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు,నిబద్ధత కల్గిన రాజకీయ వేత్త బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత శ్రీ.కొండా లక్ష్మణ్ బాపూజీ గారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.

పత్రిక ప్రకటన
తేది 27.09.2021

తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు,నిబద్ధత కల్గిన రాజకీయ వేత్త బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత శ్రీ.కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్బంగా జిల్లా కలెక్టరేట్ కూడలిలో జిల్లా పాలనాధికారి కార్యాలయం లో ఘనంగా నివాళులర్పించిన అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో జన్మించారని , బాపూజీ చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు , లాయర్ గా పని చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి తనవంతుగా సహాయ సహకారాలు అందించారన్నారు , క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి, అసిఫాబాద్ నియోజకవర్గ తొలి శాసన సభ్యులు, తెలంగాణ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరు కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడలో నడవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, పి. రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ బి సీ వెల్ఫేర్ అధికారి సుజయ్, ఇతర అధికారులు,కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

******************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post