DPRO NIRMAL: తేనే శుద్ధి కర్మాగారాన్ని సందర్శించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్.

 

పత్రిక ప్రకటన
తేది 12.01.2022
నిర్మల్ జిల్లా బుధవారం

తేనే శుద్ధి కర్మాగారాన్ని సందర్శించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్.

స్థానిక సోఫినగర్ లోని తెలంగాణ రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ తేనే ప్రాసేసింగ్ యూనిట్ ను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ల తో కలసి
తేనే శుద్ధి కర్మాగారాన్ని సందర్శించి యూనిట్ ప్రసెసింగ్ ను పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రోజుకు ఎన్ని కిలోల తేనెను సేకరిస్తారని, సేకరించిన తేనెను ఎక్కడెక్కడ సరఫరా చేస్తారని అడిగి తెలుసుకున్నారు.
ప్రాసేసింగ్ యూనిట్ పరిశుభ్రంగా ఉందని ఇదేవిధంగా కొనసాగించాలని అన్నారు.
మేనేజర్ మాట్లాడుతూ రోజుకు 300కిలోల తేనెను సేకరిస్తామని దీనిని హైదరాబాద్ జిసిసి కార్యాలయానికి పంపించడం జరుగుతుందని అక్కడినుండి మార్కెటింగ్ జరుగుతుందని, ప్రముఖ దేవాలయాలకు పంపిణి చేయడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమం లో DTWO శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ తారా చంద్, dm lk రామానందం, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post