DPRO NIRMAL: *దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సకలాంగులతో సమానంగా సమాజంలో ముందుకు సాగాలి: జిల్లా ఎస్పి శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్.

పత్రికా ప్రకటన
తేది 03.12.2021
నిర్మల్ జిల్లా శుక్రవారం

*దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సకలాంగులతో సమానంగా సమాజంలో ముందుకు సాగాలి: జిల్లా ఎస్పి శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్

*దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ అన్నారు.
శుక్రవారం స్థానిక TNGOs భవన్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించుటకు ముందుకు సాగాలని అన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని దివ్యాంగులలో ఎంతో నైపుణ్యం గల వారు ఉన్నారని అన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించుటకు వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకాదని పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. ప్రభుత్వపరంగా దివ్యాంగులకు ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలు అమలు చేస్తునారని తెలిపారు. దివ్యాంగులతో మహిళా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు మంజూరు చేస్తునారని తెలిపారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యలపై క్రమంగా సమీక్ష సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా దివ్యాంగుల సమస్యలన్నీ పరిష్కరించుటకు కృషి చేస్తామని అన్నారు. కొంతమంది దివ్యాంగుల కొత్త పెన్షన్ మంజూరుకు ప్రభుత్వానికి పంపామని త్వరలో మంజూరు అవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణీ స్రవంతి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి విజయలక్ష్మి, సిడిపిఓ, వికలాంగుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post