DPRO NIRMAL: నిర్మల్ జిల్లాలో ఇకపై ఒక్క అంగుళం భూమిని ఎవరైనా ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీ ముషారఫ్ ఫారుఖి హెచ్చరించారు.

 

పత్రికా ప్రకటన తేది:10.11.2021

నిర్మల్ జిల్లాలో ఇకపై ఒక్క అంగుళం భూమిని ఎవరైనా ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీ ముషారఫ్ ఫారుఖి హెచ్చరించారు.
బుధవారం కలెక్టర్ చాంబర్ లో జిల్లా ఎస్పీ శ్రీ సీహెచ్ ప్రవీణ్ కుమార్, డిఎఫ్ఓ శ్రీవికాస్ మీనా తో సమావేశమై అటవీ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కలెక్టర్ తో పాటు ఎస్పీ, డీఎఫ్వోలతో ఏర్పటైనఅటవీ పరిరక్షణ కమిటీ సమావేశంలో అటవీ భూములపై పలు అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అటవీ భూములను ఆక్రమించుకొని పోడు వ్యవసాయం చేసిన వారు మరింత భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే ఉన్న భూమిని కూడా స్వాధీనపరుచుకోవడం తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అటవీ భూముల ఆక్రమణ తొలగించడానికి పోలీసుల సహకారం కావాలని అటవీ శాఖ అధికారులు కోరిన పక్షంలో వెంటనే పోలీసు బందోబస్తు కల్పించడానికి కమిటీ నిర్ణయించిందని ఎస్పీ శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అటవీ అధికారులు పోలీస్ సహాయమ్ కోరిన వెంటనే ఎస్ ఐ, సి ఐ లు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేయడమైనదని ఎస్ పి తెలిపారు.జిల్లాలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు ఎస్పి తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్కడే కూడా హాజరయ్యారు.

 

 

జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post