DPRO NIRMAL: నిర్మల్ జిల్లాలో స్టార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మద్యం షాపుల టెండర్ ప్రక్రియ లో భాగంగా జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ఆధ్వర్యంలో లాటరీ పద్దతి ద్వారా డ్రా తీయడం జరిగింది.

 

 

పత్రిక ప్రకటన
తేదీ :20.11.2021.
నిర్మల్ జిల్లా శనివారం

నిర్మల్ జిల్లాలో స్టార్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మద్యం షాపుల టెండర్ ప్రక్రియ లో భాగంగా జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ఆధ్వర్యంలో లాటరీ పద్దతి ద్వారా డ్రా తీయడం జరిగింది.
47 మద్యం షాప్ లకు గాను 556 దరఖాస్తులు రాగా అందులో ఏడు దుకాణాలకు డ్రా నిలిపి వేయడం జరిగిందని, మిగతా 40 షాపులకు లాటరీ పద్ధతిన డ్రా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి ఎంపిక చేశామని జిల్లా పాలనధికారి తెలిపారు. మిగిలిపోయిన ఏడు షాపులకు త్వరలో డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రెడ్డి, ఎక్సయిజ్ సూపరేండెంట్ నాగేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post