DPRO NIRMAL: నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS-2021) పై శిక్షణ కార్యక్రమం.

పత్రిక ప్రకటన
తేది 11.11.2021
నిర్మల్ జిల్లా గురువారం

నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS-2021) పై శిక్షణ కార్యక్రమం గురువారం ఎస్ టి థామస్ హైస్కూల్ లో జిల్లా విద్యాధికారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అదనపు కలెక్టర్ డా,, పి. రాంబాబు రెవెన్యూ హాజరై మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయుటకు నిర్వహించే సర్వే ప్రపంచ రికార్డు సృష్టించబోతోన్న సందర్బంగా నవంబర్ 12 న దేశవ్యాప్తంగా ఒకే రోజు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని, మన జిల్లాలో 147 పాఠశాలలో 179 అబ్జర్వర్స్, 218 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ లతో భారీ ఎత్తున నిర్వహించబోతున్న ఈ పరీక్షలలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు పాల్గొంటారని ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించుటకు ఈరోజు అబ్జర్వర్స్, ఇన్వెస్టిగేటర్స్ లకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కరోనా సందర్బంగా దేశంలో విద్యకు విద్యార్థులు దూరమయ్యారని అలాగే కొత్త జాతీయ విద్యావిధానం రాబోతుందని ప్రస్తుత పరిస్థితుల్లోవిద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయుటకు ఈ పరీక్ష నిర్వహించబోతున్నారన్నరు. రాబోయే రోజుల్లో విద్యా విధానంలో సంస్కరణలు తేవడానికి పరీక్ష ఎంతో ఉపయోగపడుతుందని, ఈ పరీక్ష నిర్వహించుటలో కేటాయించిన విధులను, బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. నిర్మల్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానం నిలుపుటకు అందరూ కృషి
చేయాలని సూచనలు చేశారు.

జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పకడ్బందీగా పెద్దయెత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనిపై అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. నవంబర్ 12 న ఉదయం 10.30 నుంచి 12.30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని, 3,5,8,10 వ తరగతుల వారీకి ఈ పరీక్ష ఉంటుందని అలాగే తరగతులు బోధించే అధ్యాపకులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కూడా ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు శ్రీమతి సలోమి కరుణ, రాజేశ్వర్, రవిగౌడ్, ప్రవీణ్, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ పద్మ, జిల్లా సైన్స్ అధికారి కెవినోద్ కుమార్, మండల విద్యాధికారులు శంకర్, మధుసూదన్, ముత్యం చంద్రకాంత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post