DPRO NIRMAL: పంట కల్లాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయండి. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

జిల్లాలో నిర్మాణంలోనున్న పంట కల్లాలను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంట కల్లాల నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన పంట కల్లాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 2425 పంట కల్లాలకు గాను ఇప్పటివరకు 1750 పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాకింగ్ ట్రాక్ పూర్తి చేసి విరివిగా మొక్కలను నాటాలన్నారు. పంచాయతీ నిధులను సక్రమంగా వినియోగిస్తూ త్వరగతిన పనులు పూర్తీ చేయాలని సూచించారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ, ఇంచార్జి డి ఆర్ డి ఏ పిడి సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఎం పి డి ఓ లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ ఏడి లు, ఏవోలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయడమైనది.

Share This Post