DPRO NIRMAL: పట్టణప్రగతి పనులను వేగవంతం చేయండి జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది 24.09.2021

మెప్మా, dist లే అవుట్ ఆప్రూవల్ కమిటీ, పట్టణప్రగతి ల పై శుక్రవారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ మాట్లాడుతూ మెప్మా ద్వారా cdma ఆదేశాల మేరకు udid (unique disability identicard ) కార్డులను పంపిణి చేయాలని dwo స్రవంతి, mepma సుభాష్ లను ఆదేశించారు.
మున్సిపల్ పరిధిలో ఈ కార్యక్రమం పై ద్రుష్టి సారించాలని కమిషనర్ లను ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్ లు ప్రయివేట్ స్థలం లో ఉన్న వాటిని గుర్తించి ప్రభుత్వ భవనం లోకి మార్చాలని రేపటిలోగా దీనికి సంబందించిన నివేదిక సమర్పించాలని అన్నారు.
ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ స్కిమ్ ద్వారా వంద శాతం పూర్తి చేయాలని, పీఎం svanidhi, బ్యాంక్ లింకేజి, udid కార్డ్స్ కి సంబందించి disbursement ప్రారంభించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.
Dist లే అవుట్ అప్రూవల్ కమిటీ లో కలెక్టర్ చైర్మన్, అదనపు కలెక్టర్ కన్వీనర్, ఇఇ ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, dtcpo లు మెంబర్స్ గా ఉంటారని కమిటీ క్షేత్రస్థాయిలో వెంచర్స్ ను పరిశీలించిన తర్వాతే అప్రూవల్ ఇవ్వాలని తెలిపారు.
పట్టణ ప్రగతిలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు.
డంపింగ్ యార్డ్, శేగ్రీగెషన్ షెడ్ ల్, తడి చెత్త, పొడిచేత్త వేరువేరు గా సేకరించాలని , సానిటేషన్ ప్రతి రోజు జరగాలని అన్నారు.
శ్యాంగడ్ వద్ద పిచ్చి మొక్కలు తొలగించాలని కమిషనర్ లను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, బైంసా, ఖానాపూర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ లు, dwo, మెప్మా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

*******************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post