DPRO NIRMAL: పట్టణ ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయండి… జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ

పత్రికా ప్రకటన-2 తేది: 25.08.2021

పట్టణ ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయండి.

జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ

00000

పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో పట్టణ ప్రగతి పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి లో భాగంగా చేపట్టిన డంపింగ్ యార్డ్, శేగ్రిగెషన్ షెడ్లు, పట్టణ ప్రకృతి వనాలు తదితర అభివృద్ధి పనులు త్వరగతిన పూర్తి చేయాలనీ ఆదేశించారు. ప్రతి ఇంటినుండి తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. హరితహారం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. టౌన్ ప్లానింగ్, అకౌంట్స్, టాక్స్ వాసులు తదితర వాటిని పక్కాగా పర్యవేక్షించాలన్నారు. సెప్టెంబర్ 01నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న దృశ్య పట్టణ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ లను మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు.

ఈ సమావేశం లో నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ లు ఎం. ఎ అలీం, గంగాధర్, మేనేజర్ భుజంగ్ రావ్, టి. పి ఓ సుమలత, అధికారులు నాగేశ్వర్ రావ్, స్వామి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

***********************************************************************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post