DPRO NIRMAL: పదవ తరగతి పరీక్షలు పక డ్బెందిగా నిర్వహించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

పదవ తరగతి పరీక్షలు
పక డ్బెందిగా నిర్వహించాలి
జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

వచ్చే నెల మే, 23 నుండి నిర్వహించనున్న 10 వ తరగతి పరీక్షలను సాఫిగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అన్నారు.
శుక్రవారం జిల్లా పాలనాధికారి మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులతో 10 వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయము తో మంచి ఫలితాలను సాధించాలని, గత రెండు సంవత్సరాల అనంతరం పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
పరీక్షలు విజయంతంగా నిర్వహించేందుకు గాను పోలీస్ శాఖ ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు కొసం ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని అలాగే పరిసర ప్రాంతంలో గల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ఫ్లైయింగ్ స్కార్డ్ గా నియమించాలని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షకు ముందు తరువాత అవసరసరమైన RTC బస్సులు అన్ని రూట్లలో నడిపించాలన్నారు. వైద్య శాఖ ప్రతి పరీక్ష కేంద్రంలో ఎఎన్ఎమ్ లను ఏర్పాటు చేసి అవసరమైన మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అలాగే త్రాగు నీరు, ఫ్యాన్లు, ఫర్నిచర్స, తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. జిల్లా లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 163 , అందులో విద్యార్థులు 6625 మంది, ప్రయివేట్ పాఠశాలలు 103, అందులో 3068 విద్యార్థులు మొత్తం 9693 పరీక్షకు హాజరువుతున్నారని అయన తెలిపారు.
మే 23, 2022 నుండి జూన్ 1 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
సెల్ ఫోన్ లు పరీక్ష కేంద్రాలకు తీసుకురావద్దని, సిసి కెమెరా లు ఏర్పాటు చేయాలని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్,ట్రాన్స్పోర్ట్, పోస్టల్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు అందరు అందుబాటులో ఉండాలని, పరీక్షలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అవాంచానియా సంఘటనలు జరగకుండా పరీక్షలు సాజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

అదనపు కలెక్టర్ రెవిన్యూ పి. రాంబాబు మాట్లాడుతూ పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఒకరికి బదులు ఇంకొకరు వ్రాయకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ లో వద్యార్థులకు వెసులబాటు కల్పించాలని హల్ టికెట్ చూసి పంపాలని, పరీక్షలకు సమయానికి కేంద్రాలకు చేరుకొనేలా చూడాలని అన్నారు. అలాగే ప్రయివేట్ పాఠశాలలు విద్యార్థుల ఫీజ్ విషయం లో ఆటంకాలు కల్పించకుండా హల్ టికెట్స్ జారీ చేయాలని, ఎట్టి
పరి స్థితుల్లో హాల్ టికెట్స్ ఆపవద్దని తెలిపారు. విద్యార్థులు హల్ టికెట్స్ ఆన్ లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని,
గత రెండు సంవత్సరాల నుండి కరోనా వల్ల పరీక్షలు నిర్వహించడం జరగలేదని , అన్ని జాగ్రత్త లు పాటిస్తూ పరీక్ష లకు సంసిద్ధంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే , జిల్లా విద్యా శాఖ అధికారి ఎ. రవీందర్ రెడ్డి, పరీక్షల సహాయ కమిషనర్ శ్రీమతి ఎస్. పద్మ, జిల్లా వైద్యాధికారి ధన్ రాజ్
జిల్లా ట్రేజరీ అధికారి, rtc సాయన్న, ట్రాన్స్పోర్ట్ అధికారి అజయ్ కుమార్, ఇంటర్ మీడియట్ అధికారి పరుశరామ్, అదనపు పౌర సంబంధాల అధికారి తిరుమల, పోలీస్ శాఖ అధికారి, సెక్టోరియల్ అధికారులు, తదితరులుపాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post