DPRO NIRMAL: పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.
శనివారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పల్లెప్రగతి పనులలో క్రిమిటోరియం శేగ్రీగేషన్ షెడ్స్, పల్లె ప్రకృతి వనాల పై ఎంపీడీఓ ఎంపీవో లతో సమీక్షా సమావేశం అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి ప్రతీ మండలాల గ్రామాలలోని జనాభా, ఎన్ని కిలోల చెత్త ను సేకరిస్తున్నారు క్షుణ్ణంగా ప్రతీ ఎంపీవో ను అడిగి తెలుసుకున్నారు.
తక్కువ తడి పొడి చెత్త ను సేకరిస్తున్న కొన్ని మండాలాలు వాటి పై దృష్టి సారించాలని అన్నారు.
రోడ్ల పై, మురికి కాలువలలో ఎక్కడా కూడా చెత్త ప్లాస్టిక్ కవర్స్ కనిపించకూడదని, ట్రాక్టర్ ల ద్వారా డంపింగ్ యార్డ్ లకు తరలించాలని, గ్రామ పంచాయతీ సెక్రెటరీ హెడ్ క్వార్టార్ లో ఉండి ట్రాక్టర్ ల విషయం లో సమయపాలన పాటించి ఉదయం 7.00
గంటల లోపే ఇంటింటి చెత్తను సేకరించాలని, రోజువారి చెత్త ఎన్ని కిలోలు సేకరిస్తున్నారు ప్రతిరోజూ డేటా సమర్పించాలని ఆదేశించారు. మియా వాకి ప్లాంటేషన్ ను ఏర్పాటు చేయాలని, మొక్కలకు రోజు నిరందించాలని అన్నారు.
పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో సీఈఓ సుధీర్, drdo విజయలక్ష్మి, డీపీవో వెంకటేశ్వర్ రావ్, ఎంపీడీఓ లో, ఎంపీవో లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post