DPRO NIRMAL: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్.

 

 

పత్రికా ప్రకటన తేది:07.12.2021

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్

ఈ నెల 10 న జరుగనున్న శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శ్రీ నవీన్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి తో కలిసి మంగళవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తిరిగి వచ్చే మార్గాలను నవీన్ మిట్టల్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు పోలింగ్ కేంద్రంలో కల్పించిన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఎక్కడా జరగదు లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్ఖడే, రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ రమేష్ రాథోడ్, ఎమ్మార్వో అర్బన్ జాకీర్, జెడ్పీ సూపర్నెండెంట్ నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post