DPRO NIRMAL: ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా పాలనాధికారి ముషర్రఫ్ ఫారుఖీ.

ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి జిల్లా పాలనాధికారి ముషర్రఫ్
ఫారుఖీ.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదులలో భాగంగా ఈరోజు అర్జీ దారుల నుండి 25 దరఖాస్తు లు వచ్చాయని జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.
సోమవారం జిల్లా పాలనాధికారి కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను వింటూ తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
గత కొంత కాలంగా అనివార్యకారణాల వల్ల ప్రజావాణి వాయిదా వేయడం జరిగిందని పేర్కొంటూ తమ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వచ్చి పరిష్కరించుకోవాలని, ఈ ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రజాఫిర్యాదులలో అదనపు కలెక్టర్ లు పి. రాంబాబు, హేమంత్ బోర్కడే, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబందాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post