DPRO NIRMAL: ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర…జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారుఖీ.

 

 

పత్రికా ప్రకటన
తేదీ: 25.1.2022
నిర్మల్ జిల్లా మంగళవారం

12వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమ వేడుకలకు ముఖ్య అతిధి గా జిల్లా పాలనాధికారి ముషరఫ్ ఫారుఖీ హాజరై మాట్లాడుతూ ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భరత్ లో ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారని 1950 జనవరి 25 న దేశంలో ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని అందుకే ఈ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవం గా ఎంచుకున్నారని అన్నారు. ఇది ఎన్నికల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఉద్దేశించబడిందని తెలిపారు.
ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివృద్దికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఓటర్లందరూ విధిగా ఆలోచించి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ది దిశలో నడిపే నాయకులనే ఎన్నికలలో గెలిపించుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదు, ఓటర్లను చైతన్యవంతులను చేయుటలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ సందర్భంగా అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. “భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము”

ఈ సందర్భంగా 01-01-2022 వరకు 18 సంవత్సరములు నిండి కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు కలెక్టర్ ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, తహశిల్దార్ శివకుమార్ , జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post