DPRO NIRMAL: ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. నర్సాపూర్ మండలం కుస్లీ, బైంసా మండలం ఎగ్గామ్ లోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ను జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ శనివారం ఆకస్మికంగా సందర్శించారు.

 

 

 

పత్రిక ప్రకటన
తేది :27.11.2021
నిర్మల్ జిల్లా శనివారం

ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
నర్సాపూర్ మండలం కుస్లీ, బైంసా మండలం ఎగ్గామ్ లోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ను జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కుస్లీ పాఠశాల విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ లో లేకుండా సివిల్ డ్రెస్ లో ఉండగా విద్యార్థులకు యూనిఫామ్ అందజేయలేదా అని ప్రధాన ఉపాధ్యాయులను కలెక్టర్ అడగగా యూనిఫామ్ కుట్టించేందుకు టైలర్ కి ఇచ్చామని రెండు రోజుల్లో వస్తాయని తెలిపగా, రెండు రోజుల్లో స్ట్రిచింగ్ పూర్తి కాగానే ఫోటో తీసి పంపించాలని, పూర్తి కాకపొతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం ఓటరు నమోదు ప్రక్రియ లో భాగంగా ఇంటింటి సర్వే ఎలా చేస్తున్నారో పరిశీలించారు.
ఎగ్గామ్ పాఠశాలలోని విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు.
తరగతి గదులను , పాఠశాల పరిసరాలను పరుశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో విద్యా శాఖ అధికారి రవీందర్ రెడ్డి, mro తుకారం, విశ్వంబర్ ,ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post