DPRO NIRMAL: ప్రసిద్ధ రామాయణం రాసిన వాల్మికి మహర్షి జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ శ్రీ ముషరాఫ్ ఫారూకి అన్నారు .

పత్రిక ప్రకటన తేది 20.10.2021
ప్రసిద్ధ రామాయణం రాసిన వాల్మికి మహర్షి జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ శ్రీ ముషరాఫ్ ఫారూకి అన్నారు .
బుధవారం జిల్లా కల్లెక్టర్ కార్యాలయం లో వాల్మికి జయంతి సందర్బంగా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రసిద్ధ రామాయణ మహాకావ్యాన్ని రచించిన శ్రీ వాల్మీకి మహర్షి కుటుంబ పోషణ కోసం దొంగ తనాలు, దారి దోపిడిలు చేసేవాడని అన్నారు. నారద మహర్షి హితోపదేశం వల్ల రామాయణ మహా కావ్యాన్ని రాసి మహర్షి అయినాడన్నారు రామాయణ మహా కావ్యాన్ని మొట్టమొదట సంస్కృతి బాష లో రచించి ఆది కవి గా పేరు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు శ్రీ హేమంత్ బోర్ఖరే, శ్రీ రాంబాబు లు మున్సిపల్ చైర్మన్ శ్రీ గండ్రత్ ఈశ్వర్ , సహాయ బి.సి సంక్షేమ శాఖ అధికారి శ్రీ సుజయ్ పరిపాలనధికారి, శ్రీ కాలి క్ అహ్మద్ TNGO అధ్యక్షులు శ్రీ ప్రభాకర్, బిసి సంక్షేమ శాఖ సిబ్బంది కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, వాల్మికి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

************జిల్లా పౌర సంబందాల అధికారి నిర్మల్ చే జారి చేయబడినది.

Share This Post