DPRO NIRMAL: ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం పనులను వేగవంతం చేయండి. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖి.

ప్రచురణార్థం
21.09.2021
ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం పనులను వేగవంతం చేయండి.
జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖి
ఆహార ఉత్పత్తుల కేంద్రం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓనీ గ్రామంలో ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మంజూరు చేసిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆహార ఉత్పత్తుల కేంద్రాలను నెలకొల్పుతున్నందున జిల్లాలో ఈ కేంద్రం ఏర్పాటుకు 620.26 ఎకరాల SRSP కి చెందిన స్థలాన్ని ప్రభుత్వం పరిశ్రమల శాఖకు కేటాయించిందన్నారు. సంబంధిత అధికారులు ఈ స్థలంలో వెంటనే సరిహద్దులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థలానికి సంబంధించిన హద్దులను అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్ఖడే శ్రీ పి రాంబాబు పరిశీలించారు.
ఆన్లైన్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులను ఆహ్వానించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు, భైంసా అడిషనల్ ఎస్పీ కిరణ్, బాసర తాసిల్దార్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

**********************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post