DPRO NIRMAL: బడుల ప్రారంభానికి సర్వం సిద్ధం చేయండి పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత……జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ.

పత్రికా ప్రకటన-3 తేది: 25.08.2021

బడుల ప్రారంభానికి సర్వం సిద్ధం చేయండి
పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత

*జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ *

00000

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవెట్ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలో పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ నెల 30 వరకు ప్రారంభానికి సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ ఉపాధ్యాయులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి ప్రభుత్వ పాఠశాల ల ఉపాధ్యాయులకు, సమావేశ మందిరంలో ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు వేరు వేరుగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, అలాగే కళాశాలలు ఈ నెల 30 నాటికి పారిశుధ్య పనులు చేపట్టి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిల్లల ఆరోగ్య దృష్ట్యా కరోనా నేపద్యంలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ త్రాగునీరు , మరుగుదొడ్లు శుభ్రత, త్రాగునీటి ట్యాంకులు శుద్ది, తరగతి గదుల పరిశుభ్రత వంటి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీ, మున్సిపల్ నిధులతో చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో టీచర్లు వందశాతం హాజరు కావాలని సూచించారు. ముందస్తుగా పిల్లల తల్లిదండ్రులకు పాఠశాలల పునర్ ప్రారంభోత్సవ సమాచారం అందించాలన్నారు. కిచన్ షేడ్స్ ఎప్పటికప్పుడు శుబ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 30 నాటికి సూచించిన అన్ని పనులు పూర్తి చేసి ధృవీకరణ పత్రం అందించాలని సూచించారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు . పిల్లలో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని అలాగే దోమల వలన వచ్చే డెంగీ, మలేరియా కేసులు నమోదు కాకుండా ఫాగింగ్, యాంటీ లార్వా మందులను ఉపయోగించాలని సూచించారు.
ఈ సమావేశాల్లో జిల్లా విద్యా శాఖ అధికారి ప్రణీత, ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

***************************************జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post