DPRO NIRMAL బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 8 నుండి 14వరకు ఉత్సవాలు ఘనంగా జరపాలని, అని జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి అన్నారు.

పత్రికా ప్రకటన తేది: 08.11.2021

బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 8 నుండి 14వరకు ఉత్సవాలు ఘనంగా జరపాలని, అని జిల్లా కలెక్టర్ శ్రీ ముషార్రఫ్ ఫారూఖి అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలల దినోత్సవ సందర్బంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశం లో ముందు గా జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ అధికారిని శ్రీమతి స్రవంతి ముందుగా వారంరోజులు నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల పరిరక్షణ అన్నది ఏ ఒక్క శాఖకు పరిమితం కాదని ఈ వారం రోజులే కాకుండా నిరంతరం గా అన్ని లైన్ శాఖల సమన్వయంతో జరగాలని అన్నారు.. జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నియోజకవర్గ శాసనసభ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో పిల్లలకు ఫుట్బాల్, వాలి బాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటల పోటీలు, పాటల పోటీలు నిర్వహించి వారిని ఉత్సాహవంతులను చేయాలని అన్నారు. ఒకరోజు సఖి సెంటర్లో ఒక కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామసభలలో కూడా ఈ అంశాలను అవగాహన కల్పించాలన్నారు. జువైనల్ వెల్ఫేర్ హోమ్స్, బాలసదనంలో కేజీబీవీ పాఠశాలల్లో పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పిల్లల హక్కులను కాపాడాలని, వారికి రక్షణ కల్పించడం అందరి భాద్యత అన్నారు.బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. పిల్లలకు కల్పిస్తున్న హక్కులపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, కోవిడ్ బాదిత పిల్లలకు అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం వారికి అందిస్తున్న పారితోషికాన్ని ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పెయింటింగ్, డ్రాయింగ్, డిబేట్లు,బాల్యవివాహాలు, ట్రాఫికింగ్ పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తెలిపారు. వాటితోపాటు అవుట్ డోర్ గేమ్స్ ఖో.ఖో, రంగోలి వంటి ఆటలు నిర్వహించాలని తెలిపారు. మెప్మా, డిఆర్డిఎ లతో కలిసి నిర్వహించాలన్నారు.కార్యక్రమం చివరలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానం ఇద్దరిని గాలిపటాల ఎగరనిద్దాం.
ఏ ఆభరణాలూ వద్దు నాకు చదవునే ఆభరణం చాలు నాకు గోడ పత్రికలను విడుదల చేశారు..
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ శ్రీ హేమంత్ బోర్కడే, జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, డీపీవో శ్రీ వెంకటేశ్వర్లు, డిఎం అండ్ హెచ్వో శ్రీ ధనరాజ్, బాలల సంరక్షణ సమితి చైర్మన్ ఎండీ వాహిద్, జిల్లా చైల్డ్ రక్షణ అధికారి మురళి, సిడిపివో శ్రీమతి నాగమణి, ఏసీపివో రాజు, సఖి సెంటర్ ఏవో మమత, బాలల సంక్షేమ సమితి సభ్యులు, ఏ ఎల్, ఓ శ్రీమతి శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Share This Post