DPRO NIRMAL: బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి.*

ప్రచురణార్థం
21.09.2021

బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి.*

    నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ ముషరాఫ్ ఫరూఖీ సందర్శించి క్యాంపస్ అభివృద్ధి పనులు, భోధన యంత్రాల పని తీరు మరమ్మత్తులు, సుందరీకరణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా క్యాంపస్ లోని లాబొరేటరీలను, విద్యార్థి తరగతి గదులను, వసతిగృహాలు, క్రీడా ప్రాంగణాలు, ఆడిటోరియం, వ్యాయామశాలలు సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. లాబరేటరీలో యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మరియు ఎక్స్ రే డై ఫ్రాక్షన్ మిషన్ తదితర మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత సంవత్సరం షాట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన భాగాన్ని వెంటనే మారమ్మతులు చేయించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన తదితర అంశాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్ సుందరీకరణపై శ్రద్ధ వహించాలని,ప్రతి అంశం పై శ్రద్ధ తీసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  అనంతరం కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి, అదనపు కలెక్టర్లు శ్రీ హేమంత్ బోర్ఖడే, పి. రాంబాబు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  ట్రిపుల్ ఐటీ ఏవో ప్రొఫెసర్ రాజేశ్వర్రావు, సివిల్ డీఈ ఎం. రాజాకిషన్ రెడ్డి,   అసిస్టెంట్ రిజిస్టర్ జి. రంజిత్ కుమార్ కోఆర్డినేటర్ రాకేశ్ రెడ్డి, బైంసా ఏ ఎస్పీ కిరణ్, తాసిల్దార్ శ్రీకాంత్, త్రిబుల్ ఐటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

******************జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post