DPRO NIRMAL: మద్యం దుకాణాల టెండర్లు లాటరీ పద్ధతిన పకడ్బందీగా, నిబంధనల మేరకు నిర్వహించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

 

పత్రిక ప్రకటన
19 .11 .2021
నిర్మల్ జిల్లా శుక్రవారం

మద్యం దుకాణాల టెండర్లు లాటరీ పద్ధతిన పకడ్బందీగా, నిబంధనల మేరకు నిర్వహించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
శుక్రవారం రాత్రి స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్ విశ్వనాద్ పేట్ లో నూతన మద్యం పాలసీ 2021-2023 లాటరీ పద్దతిన మద్యం షాపుల కేటాయింపు సందర్బంగా రేపు 20వ తేదీన ప్రోహిబిషన్ ఎక్సయిజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మద్యం దుకాణాల టెండర్ల ఏర్పాట్లను పరిశీలించారు.
నిర్మల్ 29, బైంసా 18 మొత్తం 47షాపులకు గాను మొత్తం 556 మంది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు, శనివారం ఉదయం,10,30 గంటల నుండి లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎలాంటి సమస్యలు తలే త్తకుండా చూడాలని, లాటరీ ఎంపిక ప్రక్రియ పద్దతి ప్రకారంగా జరగాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పై. రాంబాబు, ప్రో హిబిషన్ అధికారి రవీందర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాలా అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post