DPRO NIRMAL : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పై స్థానిక జిల్లా పరిషత్ లో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ఎంపీడీ ఓ, ఎంపీవో, apo, ఈ సి, టి ఏ లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

పత్రిక ప్రకటన
తేది 22.11.2021
నిర్మల్ జిల్లా సోమవారం

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పై స్థానిక జిల్లా పరిషత్ లో జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ ఎంపీడీ ఓ, ఎంపీవో, apo, ఈ సి, టి ఏ లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం 30 జిపీ లకు 50 % శాతం లేబర్ మొబైలైజేషన్ పనులు పురోగతి పై సమీక్షించారు.
రిజిస్టర్ లు సక్రమంగా నిర్వహించాలని, అర్హులైన వారికి జాబ్ కార్డ్ లు అందించాలని, పనులు జరిగే ప్రదేశాలలో బోర్డులు ఏర్పాటుచేసి పూర్తి వివరాలు నమోదు చేయాలని, కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని తెలిపారు.
అలాగే ఉపాధి హామీ నర్సరీ ల నిర్వహణ లో ఉపాధి పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని, నర్సరీల నిర్వహణ పనులు వంద శాతం పూర్తి చేయాలని, ట్యాంకార్ పే మెంట్ ఖచ్చితంగా జరగాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, drdo కే. విజయలక్ష్మి, సిఈ ఓ సుధీర్ ఎంపీడీఓ లు, apoలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి చే జారీ చేయనైనది.

Share This Post